Abn logo
Oct 26 2021 @ 14:01PM

నేను ఎప్పటికీ హిందూవాదినే: MLA Kiliveti

నెల్లూరు: తాను ఎప్పటికీ హిందూ వాదినే అని...హిందువుగా పుట్టాను, హిందువుగానే మరణిస్తానని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్పష్టం చేశారు.  హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్  కావడం చాలా బాధాకరమన్నారు. తాను 2017లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్రైస్తవ సోదరుల ఆహ్వానం మేరకు శిలువ మోసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న తాను ప్రస్తుతం అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సబబు కాదని చెప్పారు. దేశ ప్రధాని మోడీ, మాజీ  సీఎం చంద్రబాబు చర్చిలు, మసీదుల్లో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం లేదా? అని ప్రశ్నించారు. ఫోటోలు వైరల్ చేయడం పసుపు చొక్కాలు ధరించే నేతల పనే అని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...