Abn logo
Apr 25 2021 @ 00:00AM

పీచ్‌ ఫిజ్‌

కావలసినవి

పీచ్‌ పండ్లు - రెండు, నిమ్మరసం - పావు కప్పు, పంచదార - పావు కప్పు, ఐస్‌ - కొద్దిగా, లైమ్‌ మినరల్‌ వాటర్‌ - ఒకటిన్నర లీటరు, కోరిందకాయలు (రా్‌స్పబెర్రీస్‌)- నాలుగైదు, పుదీనా ఆకులు - కొన్ని.


తయారీ విధానం

  1. స్టవ్‌పై సాస్‌ పాన్‌ పెట్టి పీచ్‌ పండ్లు, నిమ్మరసం, పంచదార వేసి చిన్నమంటపై ఉడికించాలి. పీచ్‌ పండ్లు మెత్తగా ఉడికిన తరువాత బ్లెండర్‌లోకి మార్చుకోవాలి.
  2. మిశ్రమం చల్లారిన తరువాత బ్లెండర్‌లో మెత్తగా అయ్యే వరకు పట్టుకోవాలి. తరువాత ఫ్రిజ్‌లో పెట్టాలి. 
  3. సర్వ్‌ చేసుకునే ముందు గ్లాసుల్లో పోసి మినరల్‌ వాటర్‌, ఐస్‌ వేసి కలపాలి. పుదీనా ఆకులు, రాస్ప్‌బెర్రీ్‌సతో గార్నిష్‌ చేసి చల్లగా సర్వ్‌ చేయాలి.