పిల్లల బాగోగులను పర్యవేక్షించాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-07-29T06:55:54+05:30 IST

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి అండగా ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పథి సూచించారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సంరక్షకులతో కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు.

పిల్లల బాగోగులను పర్యవేక్షించాలి : కలెక్టర్‌
శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, జూలై 28 : కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికల బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వారికి అండగా ఉండాలని కలెక్టర్‌ పమేలా సత్పథి సూచించారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సంరక్షకులతో కలెక్టరేట్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల బాగోగులను, జిల్లాసంక్షేమ శాఖ బాలల సం రక్షణ సమితి నుంచి అందుతున్న సేవలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికో నోడల్‌ అధికారిని నియమిం చి, అన్నిసౌకర్యాలు సమకూర్చాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా కల్పించారు. భువనగిరి, ఆలేరు, అడ్డగూడూరు, నారాయణపూర్‌, తుర్కపల్లి, పోచంపల్లి, చౌటుప్ప ల్‌ మండలాలకు సంబంధించి 12 గ్రామాలకు చెందిన 21 మంది పిల్లలు వారి సంరక్షకులు సమావేశానికి హాజరయ్యారు.  సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ బండారు జయశ్రీ, సభ్యుడు శివరాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సైదులు, కరుణ, తదితరులు పాల్గొన్నారు. 

ఆదర్శ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి  

రాజాపేట: ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి, రైతులు అధిక లాభాలను సాధించాలని కలెక్టర్‌ పమేలా సత్పథి అన్నారు. వారంలో రోజులుగా భూసార పరీక్షలు, ఆధునిక సాగుపై శిక్షణ పొందిన రైతులకు మండల కేంద్రంలోని రైతువేదికలో సర్టిఫికెట్ల ను కలెక్టర్‌ అందజేశారు. అనంతరం వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ పద్మావతి, ఏవో మాధవి, ఎంపీపీ బాలమణియాదగిరిగౌడ్‌, సర్పంచ్‌ ఈశ్వరమ్మ,ఎంపీటీసీ రాజు,తహసీల్దార్‌ జయమ్మ, ఎంపీడీవో రామరాజు,ఆత్మచైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-29T06:55:54+05:30 IST