పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2022-04-24T04:45:35+05:30 IST

వడగండ్ల వర్షం కారణంగా వరి పంటను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా నాయకులు గోపాల్‌, అంజిలయ్యగౌడ్‌ పేర్కొన్నారు.

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
దామరగిద్దలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న నాయకులు

- వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు గోపాల్‌ 

దామరగిద్ద, ఏప్రిల్‌ 23 : వడగండ్ల వర్షం కారణంగా వరి పంటను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం జిల్లా నాయకులు గోపాల్‌, అంజిలయ్యగౌడ్‌ పేర్కొన్నారు. శనివారం మం డలంలోని దామరగిద్ద, ముస్తాపేట్‌, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి గ్రామాలను సందర్శించి పంట పొలాలను పరిశీలించి మాట్లాడారు. చేతికి వచ్చిన వరిపంట ఆకాల వర్షం కారణంగా నష్టపోవడం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీ లించి ఎకరాకు రూ.40 వేలు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈనెల 25న తహసీల్దార్‌ కార్యాలయం ముందు రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపీపీ మహేష్‌గౌడ్‌, సీఐటీయూ మండల నాయకులు జోషి, చాపలి కిష్టప్ప, బాలప్ప, ఉన్నారు.

 85 ఎకరాలకు పైగా వరి పంట నష్టం..

మండలంలోని దామరగిద్ద, లింగారెడ్డిపల్లి, బాపన్‌పల్లి, కందెన్‌పల్లి, పిడ్డెంపల్లి, క్యాతన్‌పల్లి, గ్రామాల్లో వడగండ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటను ఏవో అరవిందు పరిశీలించి రైతులతో మాట్లాడారు. మండలంలో 9371 ఎకరాల వరి పంట సాగులో ఉండగా వర్షం కారణంగా సుమారు 85 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన పంటల వివరాల నివేధికను ఉన్నతాఽ దికారులకు పంపిస్తామన్నారు. 

Updated Date - 2022-04-24T04:45:35+05:30 IST