అటకెక్కిన ఆధునికీకరణ

ABN , First Publish Date - 2021-07-30T05:43:56+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణ పనులు అటకెక్కాయి.

అటకెక్కిన ఆధునికీకరణ
జగిత్యాల జిల్లాలో గల కాకతీయ కాలువ

- ఐదేళ్లయినా పూర్తి కాని ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులు

- అసంపూర్తిగా రూ. 28.72 కోట్ల పనులు

- నిరాశలో చివరి ఆయకట్టు రైతులు

జగిత్యాల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణ పనులు అటకెక్కాయి. జగిత్యాలతో పాటు పొరుగు జిల్లా అయిన నిజామాబాద్‌ జిల్లాలో ఐదేళ్లయినా పనులు సంపూర్ణం కావడం లేదు. కొంత కాలంగా కాల్వల మరమ్మతు పనులు ఆగిపోయాయి. గతం లో టీఆర్‌ఎస్‌ సర్కారు పనులకు భారీగా నిధులు మంజూరు చేసిన ప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్ల తీరు వల్ల పనులు పూర్తి కాలేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలువల మరమ్మతులు, అభివృద్ధి పనులను అధికారులు పట్టించుకోకపోవడం అ న్నదాతలకు సమస్యగా మారింది. పలు సందర్భాల్లో నిధులు లేకపోవ డం, మరికొన్ని సందర్భాల్లో నిధులు మంజూరు అయినా సకాలంలో ప నులు పూర్తి కాకపోవడం వంటి కారణాల వల్ల ఆయకట్టు రైతులు ఇక్కట్ల పాలవుతున్నారు.

పూర్తికాని రూ. 28.72 కోట్ల పనులు...

ఎస్సారెస్పీ కాకాతీయ ప్రధాన కాల్వతో పాటు ఉప కాల్వల మరమ్మ తులకు 2016 ఏప్రిల్‌ 25వ తేదిన రూ. 28.72 కోట్ల నిధులతో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు శిలాఫలకం ఆవిష్కరించి జగిత్యాల జిల్లాలో పనులు ప్రారంభించారు. ఎస్సారెస్పీ కాకతీయ కాలు వ 4వ కిలో మీటరులో ఉన్న నిజామాబాద్‌ జిల్లా దూదిగాం నుంచి జగి త్యాల జిల్లా తాటిపల్లి వరకు సుమారు 68.300 కిలో మీటర్ల మేర దెబ్బ తిన్న చోట ప్రధాన కాల్వ సత్వర లైనింగ్‌తో పాటు కాల్వల్లో పేరుకపోయిన పిచ్చి మొక్కల తొలగింపు, ఇతర మరమ్మతు పనులు, అనుబంద కాల్వల మరమ్మతులు చేయడానికి నిధులు మంజూరు అయ్యాయి. 


జిల్లాలో 66,122 ఎకరాల ఆయకట్టుకు నిధులు....

ఎస్సారెస్పీ పరిధిలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లా పరిధిలోని 66,122 ఎకరాల ఆయకట్టుకు నిధుల కేటాయింపు జరిగింది. ఇందులో నిజామా బాద్‌ జిల్లాలో 9,182 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 56,940 ఎకరాల ఆ యకట్టుకు నీరందించే కాల్వలను మరమ్మతు చేయాలని పనులు ప్రారం భించారు. పనులను మూడు ప్యాకేజీలుగా విభజించింది. అనుబంద కా ల్వల మరమ్మతులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పనులను కే వలం ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా విధించారు. కాల్వకు త రుచుగా నీరు విడుదల చేస్తుండడంతో పాటు ఇతర కారణాల వల్ల మూడేళ్లలో రూ. 21.50 లక్షల నిధులతో సుమారు ముప్పాతిక శాతం ప నులు పూర్తి చేశారు. తదుపరి కాంట్రాక్టరుకు సరియైన సమయంలో బి ల్లులు రాకపోవడంతో పనులను అర్ధాంతరంగా వదిలేశారు. దీంతో రెం డేళ్లుగా పనులు జరగడం లేదు. 

మారని ఉప కాల్వల పరిస్థితి....

జిల్లాలోని పలు మండలాల్లో గల ఎస్సారెస్పీ ఉప కాల్వల పరిస్థితి మారడం లేదు. కాకతీయ ప్రధాన కాలువతో పాటు ఎస్సారెస్పీ కాకతీ య కాలువ పరిధిలోని ఉప కాలువలకు సైతం నిధులు మంజూరు అ యి పనులు జరగాల్సి ఉన్నప్పటికీ ముందుకు సాగడం లేదు. కాలు వల అధునికీకరణ పనులు సంపూర్ణం కాకపోవడంతో చివరి ఆయకట్టు రైతు లు సాగునీరందక అవస్థలు పడుతున్నారు. గతంలో మంజూరు అయి న నిధులు, రేట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టరు ముందుకు వచ్చే అవకాశాలు లేవని, తిరిగి కొత్తగా అంచనాలు వేసి నిధుల విడుదలతో పనులు చేసుకోవాల్సి ఉంటోందని అధికారులు అంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల రైతులకు సాగు నీరు అందించడానికి ఎస్సారెస్పీ జలాలను కాకతీయ కాలువకు విడుదల చేస్తున్నారు. కాలువల లైనింగ్‌ దెబ్బతినడం, కాలువల్లో గుంతలు ఏర్పడ డం, పూడిక పేరుకపోవడం తదితర కారణాల వల్ల చివరి ఆయకట్టుకు నీరు ఎలా అందుతుందని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త నిధులతోనే పనులు చేసే అవకాశం

- శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సారెస్పీ ఎస్‌ఈ, నిజామాబాద్‌

ఎస్సారెస్పీ కాలువల మరమ్మతుకు అవసరమైన చర్యలు తీసుకుంటా ము. ఐదేళ్ల క్రితం మంజూరైన నిధులతో పనులు చేసిన కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల పనులు అసంపూర్తిగా మిగిలాయి. ప్రస్తుతం కాలువలను అధునీకరించడానికి కొత్తగా ప్రతిపాదనలు రూ పొందించాల్సి ఉంటోంది. ఇందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తాము.


Updated Date - 2021-07-30T05:43:56+05:30 IST