బయటి వ్యక్తులపై అధికారుల సర్వే

ABN , First Publish Date - 2020-03-27T11:06:12+05:30 IST

భామిని, రాజాం మండలాల్లో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివ రాలను రెవెన్యూ, వైద్య

బయటి వ్యక్తులపై అధికారుల సర్వే

భామిని/రాజాం, మార్చి 26 : భామిని, రాజాం మండలాల్లో విదేశాలు, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివ రాలను రెవెన్యూ, వైద్య సిబ్బంది సేకరించారు. బయటి ప్రాం తాల నుంచి వచ్చిన వారి గురించి సర్వే నిర్వహించారు.  ఈ మేరకు గురువారం భామిని మండలంలోని కొరమ, చిన్న దిమిలి, పెద్దదిమిలి, ఘనసర తదితర గ్రామాల్లో రెవెన్యూ పోలీస్‌ సిబ్బంది ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించారు. వారిఇళ్లకు వెళ్లి బయటకు  రావద్దని తహసీ ల్దార్‌ ఎస్‌.నర్సింహమూర్తి సూచించారు. రాజాం  నగర పంచా యతీ పరిధిలోని వస్త్రపురికాలనీలోకి ఇతర రాష్ర్టాల నుంచి కొంతమంది వచ్చినట్లు సమాచారం మేరకు  అధికారులు అప్రమత్తమయ్యారు. 


ఎస్‌ఐ కె.రాము, పీహెచ్‌సీ  వైద్య సిబ్బంది సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్లు వారు నివాసముంటున్న ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. స్థానిక ఓ జూట్‌మిల్లులో పనిచేస్తున్న పశ్చిమ బెంగాళ్‌కు చెందిన కొందరు కాలనీలో నివాసముంటున్నట్లు గుర్తించారు.  అక్కడి  బంధువుల  వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు వెంటనే వైద్యపరీక్షలు చేయించాలని వారికి ఆదేశించారు.


Updated Date - 2020-03-27T11:06:12+05:30 IST