పావురాయిలతో భారత్‌పై నిఘా..

ABN , First Publish Date - 2020-05-26T00:46:49+05:30 IST

రకరకాల రంగుల్లో కనిపిస్తున్న పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు.

పావురాయిలతో భారత్‌పై నిఘా..

కశ్మీర్: రకరకాల రంగుల్లో కనిపిస్తున్న పావురాయిని జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా వాసులు బంధించి పోలీసులకు అప్పగించారు. పాక్ వైపు నుంచి ఆ ప్రాంతంలోకి రావడం గమనించిన వారు.. దీన్ని పాక్ కొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు. పావురాయి కాళ్లకి ఓ రింగ్ తొడిగి ఉందన్న విషయాన్ని కూడా వారు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఆ రింగ్‌పై ఉన్న గుర్తులను బట్టి భారత్‌కు సంబంధించిన వివరాలను గుట్టుచప్పుడు కాకుండా పాక్‌కు చేర్చేందుకే ఈ పావురాయికి శిక్షణ ఇచ్చి ఉంటారని స్థానికలు భావిస్తున్నారు. అయితే సరిహద్దు గుండా భారత్‌లోకి తీవ్రవాదులను పంపిద్దామని పాక్ విశ్వప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పోలీసులు దీనిపై ఎటువంటి అధికారికి ప్రకటన చేయనప్పటికీ అసలు ఈ పావురాయి కథ ఏమిటో తేల్చేందుకు వారు రంగంలోకి దిగారు. 

Updated Date - 2020-05-26T00:46:49+05:30 IST