తహసీల్దారు సంతకం ఫోర్జరీపై కేసు

ABN , First Publish Date - 2022-01-24T05:16:35+05:30 IST

పట్టణంలోని తహసీల్దారు సంతకం ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన సీఐ టీసీహెచ గోవిందు ఆదివారం తెలిపారు.

తహసీల్దారు సంతకం ఫోర్జరీపై కేసు

గుంతకల్లుటౌన, జనవరి 23: పట్టణంలోని తహసీల్దారు సంతకం ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన చేసిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన సీఐ టీసీహెచ గోవిందు ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మార్కెట్‌ యార్డు పక్కన కాలవగడ్డ వద్ద సర్వేనెం: 461-3లో 77 సెంట్ల భూమిలో చిన్న పులికొండ, పెద్దపులికొండ 1978 నుంచి ఉంటున్నారు. అయితే ఆ స్థలానికి ఉడదాల పెద్దన్న హక్కుదారుడని తహసీల్దారు ధృవీకరించినట్లుగా ఫోర్జరీ సంతకం చేసి నకిలీ సర్టిఫికెట్‌ను సృష్టించారు. దీని సహాయంతో బుక్కపట్నంలో గత జూలైలో స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇందుకు కారణమైన పెద్దన్న కోడలు బోయ లక్ష్మి, ఆమె కుమార్తెలు ఓబులమ్మ, సావిత్రమ్మ, శకుంతలమ్మ ఈ ఫోర్జరీ డాక్యుమెంటుతో తన స్థలాన్ని అక్రమంగా రిజిస్టరు చేయించుకున్నారని తహసీల్దారు దృష్టికి చిన్నపులికొండ తీసుకెళ్లారు. విచారణ చేసిన తహసీల్దారు ఆ డాక్యుమెంటులో తన సంతకం, వీర్వో సంతకం ఫోర్జరీ అయ్యాయని గ్రహించి టూటౌనలో ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఫిర్యాదు మేరకు ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

Updated Date - 2022-01-24T05:16:35+05:30 IST