Chinaకు తలవంచే ప్రసక్తి లేదన్న Taiwan
ABN , First Publish Date - 2021-10-10T17:22:03+05:30 IST
చైనా విధించిన విధానాన్ని అంగీకరించే విధంగా నిర్బంధించడానికి
తైపేయి : చైనా విధించిన విధానాన్ని అంగీకరించే విధంగా నిర్బంధించడానికి వీల్లేకుండా రక్షణ రంగాన్ని పటిష్టపరచడం కొనసాగిస్తామని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయ్ ఇంగ్-వెన్ చెప్పారు. నేషనల్ డే సందర్భంగా ఆదివారం త్సాయ్ మాట్లాడుతూ, తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారనే భ్రమలు ఎంతమాత్రం ఉండకూడదన్నారు. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాము దురుసుగా వ్యవహరించబోమన్నారు.
తమ జాతీయ భద్రత, రక్షణలను మరింత బలోపేతం చేసుకోవడానికి కృషిని కొనసాగిస్తామని చెప్పారు. తైవాన్ కోసం చైనా ఏర్పాటు చేసిన మార్గంలో నడిచే విధంగా తమను ఎవరూ నిర్బంధించడానికి వీల్లేకుండా తమను తాము కాపాడుకోవడంకోసం తమ దృఢ నిశ్చయాన్ని ప్రదర్శిస్తూనే ఉంటామన్నారు. దీనికి కారణాలను వివరిస్తూ, చైనా తమ కోసం ప్రకటించిన విధానం ప్రకారం, తైవాన్ ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు, ప్రజాస్వామిక జీవన విధానంలో జీవించే అవకాశం లేదన్నారు. తైవాన్‌లోని 23 మిలియన్ల మంది ప్రజలకు సార్వభౌమాధికారాన్ని చైనా విధానం ఇవ్వడం లేదన్నారు.