Abn logo
Aug 30 2021 @ 12:03PM

Afghanistan: మతగురువు మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ అరెస్ట్

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు ప్రముఖ మతగురువును అరెస్టు చేశారు. అఫ్ఘానిస్తాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్‌ను తాలిబన్లు అరెస్టు చేశారు.అఫ్ఘానిస్థాన్ దేశంలో ప్రభావవంతమైన మతగురువుగా మొహమ్మద్ సర్దార్ పేరొందారు. సర్దార్ ను అరెస్టు చేసినట్లు సోమవారం తాలిబన్లు ధ్రువీకరించారు.మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జద్రాన్ ఫొటోను తాలిబన్లు తాజాగా విడుదల చేశారు. చిత్రంలో మౌల్వీ కళ్లకు గంతలు కట్టారు.