Abn logo
Aug 2 2021 @ 02:04AM

కాందహార్‌ విమానాశ్రయంపై రాకెట్లతో తాలిబన్ల దాడి

కాందహార్‌, ఆగస్టు 1: అఫ్ఘానిస్థాన్‌లో దేశ సైన్యం, తాలిబన్ల మధ్య జరుగుతున్న పోరు రోజురోజుకు తీవ్రరూపు దాల్చుతోంది. ఈనేపథ్యంలో శనివారం రాత్రి కాందహార్‌ విమానాశ్రయం లక్ష్యంగా తాలిబన్లు మూడు రాకెట్లతో దాడికి పాల్పడ్డారు. వాటిలో రెండు రాకెట్లు రన్‌వేను తాకినట్టు విమానాశ్రయ చీఫ్‌ మసూద్‌ పస్తున్‌ తెలిపారు. దీంతో తాత్కాలికంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్టు చెప్పారు.