Kabul airport: తాలిబన్ల భద్రత కట్టుదిట్టం

ABN , First Publish Date - 2021-08-27T16:41:12+05:30 IST

అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుడు ఘటనలతో తాలిబన్లు అప్రమత్తమయ్యారు....

Kabul airport: తాలిబన్ల భద్రత కట్టుదిట్టం

కాబూల్ : అఫ్ఘానిస్థాన్ దేశంలోని కాబూల్ నగరంలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి, పేలుడు ఘటనలతో తాలిబన్లు అప్రమత్తమయ్యారు. కాబూల్ విమానాశ్రయంలో గేట్ల వద్ద తాలిబన్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. పేలుడు ఘటన తర్వాత విమానాశ్రయంలో తాలిబన్ల భద్రత పెంచారని నాటో రాయబారి చెప్పారు.అప్ఘాన్లను విదేశాలకు తరలించడంలో అమెరికా సైనికబలగాలు సహకారం అందిస్తున్న నేపథ్యంలో తాలిబన్లు విమానాశ్రయంలో మోహరించారు. 



వివిధ దేశాల రాయబారులు వారి వారి దేశాలకు చెందిన పౌరులను ఆగస్టు 30వతేదీ లోగా స్వదేశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడిన నేపథ్యంలో తాలిబన్లు విమానాశ్రయంలో భద్రత కల్పించాలని నిర్ణయించారు. కాబూల్ పేలుళ్లలో మృతుల సంఖ్య 103కు పెరిగింది. ఈ పేలుళ్లలో 28 మంది తాలిబన్లు కూడా మరణించారని వెల్లడైంది.

Updated Date - 2021-08-27T16:41:12+05:30 IST