రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు

ABN , First Publish Date - 2021-08-01T14:53:20+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో పండించే పంటలను సంతకు తరలిం

రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు

            - మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో కొత్తగా 120 రైతు బజార్లు ఏర్పాటు చేయడంపై పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. రైతులు తమ భూముల్లో పండించే పంటలను సంతకు తరలించడం, ప్రత్యేక ఆర్ధిక బడ్జెట్‌ నివేదికలో చోటు కల్పించాల్సిన అంశాల గురించి వ్యవసాయ వాణిజ్య సంఘాల ప్రతినిధులతో శుక్రవారం సచివాలయంలో మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రైతులు ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, ధాన్యం, పూలు తదితరాలకు గిట్టుబాటు ధర అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కొత్తగా 120 ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటుచేయడంపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న 180 రైతు బజార్లు ఆధునీకరణ చేసేందుకు తమ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. 

Updated Date - 2021-08-01T14:53:20+05:30 IST