రాష్ట్రానికి రైళ్ల ద్వారా 2వేల టన్నుల ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-06-02T12:32:42+05:30 IST

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అధిగమించేలా రైళ్ల ద్వారా పలు రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా 2 వేల టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి చేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. రాష్ట్రానికి మొట్టమొదటి ఆక్సిజన్‌ రైలు

రాష్ట్రానికి రైళ్ల ద్వారా 2వేల టన్నుల ఆక్సిజన్‌


ప్యారీస్‌(చెన్నై): రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత అధిగమించేలా రైళ్ల ద్వారా పలు రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా 2 వేల టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి చేసినట్టు దక్షిణ రైల్వే తెలిపింది. రాష్ట్రానికి మొట్టమొదటి ఆక్సిజన్‌ రైలు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం దుర్గాపూర్‌ నుంచి తండయార్‌పేటకు గత నెల 17వ తేదీ వచ్చి చేరింది. ఆ తర్వాత ఒడిసా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి 31 ఆక్సిజన్‌ రైళ్లు మెడిసిన్‌ ఆక్సిజన్‌తో వచ్చాయి. ఇందులో భాగంగా 32వ ఆక్సిజన్‌ రైలు మహారాష్ట్రలోని డోల్‌వియల్‌లో ఉన్న జిందాల్‌ స్టీల్‌ సైడింగ్‌ నుంచి చెన్నై హార్బర్‌కు సోమవారం వచ్చి చేరింది. ఈ రైలులో ఉన్న మూడు కంటైనర్లలో 62.08 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ దిగుమతి చేసుకున్నారు. కాగా, 32వ ఆక్సిజన్‌ రైలు ఒడిసా రాష్ట్రం రూర్కెలా నుంచి కోయంబత్తూర్‌ జిల్లా మదుకరైకు సోమవారం వచ్చి చేరింది. ఈ రైలులో 65.34 మెట్రిక్‌ టన్నులతో కూడిన 5 ట్యాంకర్లున్నాయి. ఈ రకంగా ఇప్పటివరకు ప్రత్యేక రైళ్ల ద్వారా రాష్ట్రానికి 2,015.04 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

Updated Date - 2021-06-02T12:32:42+05:30 IST