రుచి చూసి పేరు చెప్పాలి!
ABN , First Publish Date - 2020-05-12T06:30:21+05:30 IST
దాగుడుమూతలు ఆట అందరికీ తెలిసే ఉంటుంది. ఇదీ అలాంటి ఆటే! అయితే దాక్కున్న వ్యక్తులను పట్టుకోవడం కాదు. కళ్లకు గంతలు కట్టుకొని రుచి చూసి ఆ పదార్థం పేరేమిటో చెప్పాలి. కాలు బయటపెట్టడానికి వీలు లేని ఈ సమయంలో కాస్త భిన్నంగా ఉండే ఈ ఆటను...
- దాగుడుమూతలు ఆట అందరికీ తెలిసే ఉంటుంది. ఇదీ అలాంటి ఆటే! అయితే దాక్కున్న వ్యక్తులను పట్టుకోవడం కాదు. కళ్లకు గంతలు కట్టుకొని రుచి చూసి ఆ పదార్థం పేరేమిటో చెప్పాలి. కాలు బయటపెట్టడానికి వీలు లేని ఈ సమయంలో కాస్త భిన్నంగా ఉండే ఈ ఆటను ట్రై చేయండి.
- ముందుగా రుచి చూడడం కోసం రకరకాల పదార్థాలు తీసుకోండి.
- చాక్లెట్లు, పండ్ల రసాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, సాస్‌లు, బిస్కెట్లు... ఇలా ఏవైనా తీసుకోవచ్చు. అన్నింటిని ఒక బెంచ్ మీద వరుసగా పెట్టండి.
- ఆట ఆడే వ్యక్తి కళ్లకు గంతలు కట్టండి.
- ముందున్న రకరకాల పదార్థాలను ఒక్కొక్కటిగా స్పూన్‌తో టేస్ట్ చేస్తూ దాని పేరేంటో చెప్పాలి.
- సరిగ్గా చెప్పలేకపోతే ఓడిపోయినట్టు!
- ఎవరు ఎక్కువ పదార్థాలను సరిగ్గా గుర్తిస్తారో వాళ్లు గెలిచినట్టు!