బ్రిటీష్‌ పాలనను తలపిస్తున్న జగన్‌ పాలన

ABN , First Publish Date - 2021-07-30T06:21:12+05:30 IST

జగన్మోహనరెడ్డి పరిపాలన చూస్తుంటే బ్రిటీష్‌ పాలనలో తెల్లవారిపాలన ఎలా ఉంటుం దో ఈతరం వారికి తెలియజేస్తున్నట్టుగా ఉందని మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య రాజు అన్నారు.

బ్రిటీష్‌ పాలనను తలపిస్తున్న జగన్‌ పాలన
రామవరప్పాడు రింగ్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న టీడీపీ నేతలు, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి వినతిపత్రం

మాజీ మంత్రి ఉమా అరెస్ట్‌ను ఖండిస్తూ టీడీపీ నేతల నిరసన ప్రదర్శన

బాబూ జగ్జీవన్‌రామ్‌కు వినతిపత్రం

గుణదల, జూలై 29: జగన్మోహనరెడ్డి పరిపాలన చూస్తుంటే బ్రిటీష్‌ పాలనలో తెల్లవారిపాలన ఎలా ఉంటుం దో ఈతరం వారికి తెలియజేస్తున్నట్టుగా ఉందని మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య రాజు అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టును నిరసిస్తూ రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద బా బూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్‌ జగన్‌ డౌన్‌.. డౌన్‌ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. తర్వాత రూరల్‌ మండలంలోని 9 గ్రామాల నుంచి తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు బాబూ జగ్జీవన్‌రామ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దండు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ దేవినేని ఉమాను అన్యాయం అరెస్టుచేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానికి జరుగుతున్న అన్యాయాన్ని జగన్‌ పాలనలో ఎవరు నిలదీసినా జరిగేది ఇదే అని హెచ్చరించినట్లుగా ఉమా అరెస్టు వ్యవహారం ఉందన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ప్రసాదంపాడు ఉపసర్పంచ్‌ గూడవల్లి నరసయ్య అన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేశాయని అయితే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వాల తాటాకు చప్పుళ్లకు ఎన్నడూ తలొగ్గలేదని గుర్తుచేశారు. అన్న ఎన్‌టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టి తీరుతామన్నారు. రూరల్‌ మండల ఉపాధ్యక్షుడు గుజ్జర్లపూడి బాబూరావు మాట్లాడుతూ దేవినేని ఉమాపై బనాయించిన కేసును తక్షణమే వాపసు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రూరల్‌ మండల ప్రధాన కార్యదర్శి కోనేరు సందీప్‌, టీడీపీ నేతలు అద్దేపల్లి సాంబశివనాగరాజు, అద్దేపల్లి హరి, పరిచూరి నరేష్‌, పట్టపు చంటి, బొమ్మసాని అరుణకుమారి, నరేంద్ర చౌదరి తదితర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:21:12+05:30 IST