Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీడీపీని ఎవరూ ఏం చేయలేరు: Achennaidu

అమరావతి: అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే టీడీపీ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం పార్టీ నేతలతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డామని, ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నామని తెలిపారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు.. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు మొదలు పెట్టారని మండిపడ్డారు. టీడీపీని అణగదొక్కేందుకు సామ దాన దండోపాయాలు ఉపయోగించారన్నారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం ఉన్నంత వరకు టీడీపీని ఎవరూ ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. బీసీలకు 56, ఎస్సీలకు మూడు కార్పొరేషన్ల పేరుతో జగన్ రెడ్డి హడావుడి చేస్తున్నారని అన్నారు. రెండేళ్లలో రూపాయి బడ్జెట్ కేటాయించలేదని, రూపాయి ఖర్చు చేయలేదని తెలిపారు. నరేగా బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆర్టీసీ, విద్యుత్ ధరల పెంపుతో పేదలపై విపరీతమైన భారం మోపారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement