ప్రజలెవరూ భయపడవద్దు.. నిర్భయంగా ఓటేయండి: బోడె ప్రసాద్

ABN , First Publish Date - 2021-03-03T18:35:16+05:30 IST

ప్రజలు ఎవరూ భయపడవద్దని... నిర్భయంగా ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పిలుపునిచ్చారు.

ప్రజలెవరూ భయపడవద్దు.. నిర్భయంగా ఓటేయండి: బోడె ప్రసాద్

విజయవాడ: ప్రజలు ఎవరూ భయపడవద్దని... నిర్భయంగా ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు అధికారులు తొత్తులుగా మారి అవినీతికి పాల్పడుతూ అధికారమదంతో, డబ్బుతో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీఎమ్‌డీసీ వారిని సమాచార చట్టం ప్రకారం ఇళ్ల స్థలాలు కోసం సమాచారం ఆడిగితే అసంపూర్తిగా సమాచారం ఇచ్చారన్నారు. వారు మట్టి కోసం ఎటువంటి  పర్మిషన్‌లు ఇవ్వలేదు అని అధికారులు చెబుతున్నారని తెలిపారు. జిల్లా మైన్స్, రాష్ట్ర మైన్స్ వారు ఎవరికి వారు క్వారీ వారికి సంబంధం లేదు అని చెబుతున్నారని చెప్పారు. పేదవారికి ఇళ్ల స్థలాలు పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకోవడం జరుగుతుందని ఆరోపించారు.


వేల లారీలతో ఇసుక, మట్టిని తరలించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారని తెలిపారు. దాదాపు ఎకరానికి రూ.25 కోట్లు అంటే పెనమలూరు పరిధిలో రూ.150 కోట్ల వరకు ఇళ్ల స్థలాలులో అవినీతి జరుగుతుందని పేర్కొన్నారు. ఇళ్లస్థలాలు పేరుతో పేదలకు నష్టం వాటిల్లిందన్నారు. ముఖ్యమంత్రి  చెప్పినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు అక్రమంగా ఇసుకను తరలించే వారిపై ఏమైనా నియంత్రణ చేస్తున్నారా అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని... ప్రజలను సంక్షేమ పథకాలు తొలిగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బోడె ప్రసాద్ విరుచుకుపడ్డారు. 

Updated Date - 2021-03-03T18:35:16+05:30 IST