Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోర్టుల అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?: దేవినేని

అమరావతి: సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. నామమాత్రపు ధరకే గంగవరంపోర్టు వాటా వదులుకున్నారు. కాకినాడపోర్టు లాగేసుకున్నారు. కృష్ణపట్నం పోర్టు చేతులు మార్చారు. బందరుపోర్టును గాల్లోపెట్టారు. రాష్ట్రంలో పోర్టుల అమ్మకాలు,లావాదేవీలపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 


Advertisement
Advertisement