Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ ప్రభుత్వంలో బూతుల పంచాంగం నడుస్తోంది: Devineni

విజయవాడ:  జెడ్ కేటగిరీ భద్రత ఉన్నా కూడా సెప్టెంబర్ 17న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడికి తెగబడడం హేయమైన చర్య అని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. గ్రామ స్థాయి నుండి పార్టీ తీర్మానం మేరకు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి, ప్రథానికి లేఖలు పంపుతున్నామని తెలిపారు. రైతు కోసం తెలుగు దేశం కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు స్థానిక సూరిబాబు పార్క్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు చేపట్టిన నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు. హెరాయిన్ కేసుల నుండి ప్రజల దృష్టిని మరలించడానికే జగన్ రెడ్డి మంత్రుల బృందం బూతుల పంచాంగానికి తెరలేపిందని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పంచాంగం, పంచాంగ శ్రవణం ఉంటే ఇప్పటి ప్రభుత్వంలో బూతుల పంచాంగం నడుస్తోందని దేవినేని యెద్దేవా చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement