Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలి: Gorantla

అమరావతి: విద్యావ్యవస్థ పతనానికి దారితీసేలా ముఖ్యమంత్రి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేవలం ఆస్తులకోసమే ఎయిడెడ్ విద్యావ్యవస్థల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు చెందిన లక్షలకోట్ల ఆస్తులను తాకట్టుపెట్టి, అప్పులు తేవాలన్న తాపత్రయంలో ప్రభుత్వముందన్నారు.  లక్షలాది విద్యార్థులు, వేలాదిమంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆడుకునే హక్కు  ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.


ఎయిడెడ్ విద్యాసంస్థల స్వాధీనంతో, తనకు ఓట్లేసిన క్రిస్టియన్, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలనే ముఖ్యమంత్రి రోడ్ల పాలుచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన అన్ని జీవోలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులిస్తే, జగన్ వాటిని బుట్టదాఖలు చేశారన్నారు. విద్యార్థులు ప్రభుత్వాన్ని తిడుతున్నా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రలు దుమ్మెత్తిపోస్తున్నా, ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవడంలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎయిడెడ్ విద్యావ్యవస్థను పునరుద్ధరిస్తుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement