లేఖలు రాస్తూ కూర్చుంటే వ్యాక్సిన్లు రావు: ఆంజనేయులు

ABN , First Publish Date - 2021-05-12T18:22:04+05:30 IST

లేఖలు రాస్తూ కూర్చుంటే రాష్ట్రానికి వ్యాక్సిన్లు రావని మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు.

లేఖలు రాస్తూ కూర్చుంటే వ్యాక్సిన్లు రావు: ఆంజనేయులు

అమరావతి: లేఖలు రాస్తూ కూర్చుంటే రాష్ట్రానికి వ్యాక్సిన్లు రావని మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొనుగోలుకు పోటీ పడుతుంటే, ఈ ముఖ్యమంత్రి వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు కులాన్ని ఆపాదించి, లేఖలతో సరిపెట్టారని విమర్శించారు. పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లకైనా దయాదాక్షిణ్యం, మానవత్వం ఉంటుందేమోగానీ, ఈ ప్రభుత్వానికి లేవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. పాలకులు అవినీతి, అక్రమ సంపాదనపై పెడుతున్న శ్రద్ధలో ఒక్కశాతం ప్రజలపై చూపినా ఇన్నిమరణాలు సంభవించేవికావన్నారు. రుయా ఘటన సహా ఆక్సిజన్ అందక చనిపోయిన ఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ లేక చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం రూ.20లక్షల పరిహారమివ్వాలన్నారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇంతమంది చనిపోయేవారుకారని ప్రజలంతా అనుకుంటున్నారని జీవీ ఆంజనేయులు తెలిపారు. 

Updated Date - 2021-05-12T18:22:04+05:30 IST