Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీ వైకాపాబన్లు.. తాలిబన్లను మించిపోయారు: Lokesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైకాపాబన్లు... అరాచకాలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లను మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తన తాడేపల్లి ప్యాలస్ పక్కన ఎవ్వరూ ఉండటానికి వీల్లేదని, నిరుపేదల ఇళ్లు కూల్చేశారు జగన్ రెడ్డి అని...ఇప్పుడు భద్రత పేరుతో భరతమాత గుండెలపై గునపం దింపారని మండిపడ్డారు. తనకి 2 కోట్లతో గుడి కట్టించుకున్న జగన్ రెడ్డి... తన ఇంటి దగ్గర భరతమాత విగ్రహాన్ని తొలగించడం ఆయన నిరంకుశ, ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శనమని అన్నారు.  ప్రొక్లయినర్లతో పెకలించిన భరత మాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని... చేసిన మూర్ఖపుపనికి క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement