Advertisement
Advertisement
Abn logo
Advertisement

గృహ లబ్ధిదారుల నుంచి బలవంతపు వసూళ్లా..?

నల్లజర్ల, డిసెంబరు 6: దశాబ్దాల క్రితం నాటి గృహ నిర్మాణాలపై బలవంతపు వసూలు (ఓటీయస్‌) చేస్తారా.. ప్రభుత్వానికి ఇది తగదని జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళఫూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఓటీఎస్‌ వసూలు నిలుపుదల చేయాలని నల్లజర్లలో అంబేడ్కర్‌ విగ్రహానికి సోమవారం వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వసనీయత కోల్పోయిందన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో యువత రాష్ట్రంలో అరాచక పాలనపై ఉద్యమించాలన్నారు. గుదే వెంకట సుబ్బారావు, నిమ్మలపూడి ప్రసాద్‌, అప్పసాని మోహన్‌, గారపాటి బుల్లియ్య, మారిన దుర్గరావు, యాలమాటి ఆనంద్‌, గుదే రాంబాబు పాల్గొన్నారు.

బుట్టాయగూడెంలో వినతిపత్రం ఇస్తున్న బొరగం శ్రీనివాస్‌

బుట్టాయగూడెం: ప్రజలకు జీవించే హక్కును కల్పించిన మీరే ప్రజ లను కాపాడాలని రాజీవ్‌నగర్‌ కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహానికి నియోజక వర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ వినతిపత్రాన్ని అందజేశారు. ఓటీఎస్‌ పేరు తో ప్రభుత్వం ప్రజల నుంచి డబ్బు గుంజడాన్ని ఖండించారు. మొగపర్తి సోంబాబు, గద్దె అబ్బులు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, జారం చాందినీ, మనెల్లి బాలు, పుసులూరి అచ్యుతరావు, సిహెచ్‌ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement