Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమాత్రానికి.. దిశ పోలీస్‌స్టేషన్లు ఎందుకు..?

గుంటూరు: దిశ చట్టం అమలుకానప్పుడు.. ఇక దిశ పోలీస్‌స్టేషన్లు మాత్రం ఎందుకని టీడీపీ నేతలు జి.వి.ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు. మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ దళిత బిడ్డ రమ్యను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి.. ఎప్పుడు శిక్ష వేస్తారన్నారు. నరసరావుపేటలో హత్యకు గురైన విద్యార్థిని కోట అనూష కుటుంబానికి ఇంతవరకూ న్యాయం జరగలేదని చెప్పారు. దళితులు, ముస్లిం, మైనారిటీలకు ఏపీలో రక్షణ లేకుండా పోతోందని తెలిపారు. పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. హత్యకు గురైన అనూష కుటుంబ సభ్యులను ఈ నెల 9న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ పరామర్శిస్తారని వారు పేర్కొన్నారు.

Advertisement
Advertisement