చంద్రబాబు కోలుకోవాలని ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-01-21T03:58:23+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద ఉన్న గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

చంద్రబాబు కోలుకోవాలని ప్రత్యేక పూజలు
పోలేరమ్మ ఆలయం వద్ద టెంకాయలు కొడుతున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం

నాయుడుపేట, జనవరి 20 : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ టీడీపీ పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు పట్టణంలోని గడియారం సెంటర్‌ వద్ద ఉన్న గ్రామదేవత పోలేరమ్మ ఆలయం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నెలవల మాట్లాడుతూ దళితుల మీద దాడులు, మహిళలపై అత్యాచారాలు, గిట్టుబాటు ధరలేక రైతుల అవస్థలతో ఈ రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.  రాష్ట్రంలో అభివృద్ధి మళ్లీ జరగాలన్నా చంద్రబాబునాయుడు  మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల టీడీపీ అధ్యక్షులు అశోక్‌రెడ్డి,  విజయకుమార్‌నాయుడు, సంచి కృష్ణయ్య, టీడీపీ నాయకులు దార్ల రాజేంద్ర, జనార్దన్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-21T03:58:23+05:30 IST