ధరల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-07-23T06:12:22+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీని వల్ల సామాన్య ప్రజలపై పెనుభారం పడుతోందని కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర పావని అన్నారు.

ధరల పెంపుపై నిరసన
నిరసన వ్యక్తం చేస్తున్న తెలుగు మహిళలు

కార్పొరేషన్‌(కాకినాడ), జూలై 22: రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయని, దీని వల్ల సామాన్య ప్రజలపై పెనుభారం పడుతోందని కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర పావని అన్నారు. మేయర్‌ సుంకర పావని ఆధ్వర్యంలో కాకినాడ సంతచెరువు ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద గురువారం నిరసన తెలిపారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్లకార్డులు పట్టుకుని మేయర్‌ నిరసన వ్యక్తం చేశారు. వర్షాన్ని లెక్క చేయకుండా రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ధరల పెంపుతో పేదల నడ్డి విరుస్తున్నారన్నారు.  ప్రధాన కార్యదర్శి ప్రశాంతి, కార్పొరేటర్లు తెహరఖాతూన్‌,  బంగారు సత్యవతి, కాకినాడ రూరల్‌ కార్యదర్శి పి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T06:12:22+05:30 IST