ముఖ్యమంత్రి సారథ్యంలో ఇసుక కుంభకోణం: గోరంట్ల

ABN , First Publish Date - 2021-06-17T17:40:37+05:30 IST

ఏపీలో జేపీ కంపెనీ ఇసుకను దోపీడీ చేస్తోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

ముఖ్యమంత్రి సారథ్యంలో ఇసుక కుంభకోణం: గోరంట్ల

రాజమండ్రి: ఏపీలో జేపీ కంపెనీ ఇసుకను దోపీడీ చేస్తోందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. 10 టన్నుల ఇసుక కోసం డబ్బులు కట్టించుకుని 8 టన్నుల ఇసుక మాత్రమే సరపరా చేస్తున్నారన్నారు.  మైనింగ్ అనుమతులు లేకుండా వేమగిరి ర్యాంపులో నాలుగు మీటర్ల లోతులో ఇసుకను యంత్రాలతో తవ్వేస్తున్నారని తెలిపారు.  ఆన్ లైన్ పేమెంట్లు లేవని,  నగదు వసూలు చేస్తున్నారని అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో రోజుకి రెండు కోట్లు, రాష్ట్రమంతా రోజుకి 10 కోట్లు దోపీడీ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సారథ్యంలో రూ.2,500 కోట్ల ఇసుక కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆపీస్ సారథ్యంలో ఇసుక తవ్వకాలు జరగటం వల్ల జిల్లా యంత్రాంగం పట్టించుకోవటం లేదని విమర్శించారు. జేపీ కంపెనీ పేరుతో ఇసుక భారీ మాపియా నడుస్తుందన్నారు. చెడ్డీ గ్యాంగ్ దోపీడీపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 

Updated Date - 2021-06-17T17:40:37+05:30 IST