టీచర్ల బదిలీలకు సమాయత్తం !

ABN , First Publish Date - 2020-08-05T11:37:34+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.

టీచర్ల బదిలీలకు సమాయత్తం !

జాబితాలు సిద్ధం చేయాలని ఉత్తర్వులు

ముందుగా సర్దుబాటు


ఒంగోలువిద్య, ఆగస్టు 4 : ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. అందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఆ ర్జేడీ, డీఈవోలను ఆదేశించింది. ఈమేరకు పాఠశాల విద్య కమిషనర్‌ చినవీ రభద్రుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2017 సంవత్సరం తరువాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టలేదు. కరోనా నేపథ్యం లో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయిచిన నేపథ్యంలో ఈనెలలోనే ఉపాధ్యాయులు బదిలీలు చేయాలని ప్రభుత్వం ని ర్ణయించింది. ముందుగా ప్రభుత్వ, జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలల్లో విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపులను పునఃసమీక్షించి ఆయా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్‌ పోస్టులను సర్దుబా టు చేయాల్సి ఉంది.


అందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి ఉన్న యుడైస్‌ డేటా ఆధారంగా జాబితాలను సిద్ధం చేయాలని కమిషనర్‌ సూచించారు. ఒకే పాఠశాలలో 5 సంవత్సరాలు సర్వీసు పూర్తయిన గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్లు సర్వీసు పూర్తయిన సెంకండరీ గ్రేడ్‌ టీచర్లు, స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, ఇతర ఉపాధ్యాయు ల జాబితాలను రూపొందించాలన్నారు. వీటితోపాటు ఆయా కేటగిరీ పోస్టుల్లో ఖాళీల వివరాలు (క్లియర్‌ వేకెన్సీస్‌) పోస్టులు వారీగా లెక్క తేల్చి జాబితాను సి ద్ద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ జాబితాలు ఖాళీల వివరాలకు సంబంధించి ఒక అధికారిని నియమించాలన్నారు. డీఈవో తమ ఆర్జేడీ కార్యాలయాల్లో బా ధ్యులుగా నియమితులైన అధికార్లు పేర్లు, హోదా, మొబైల్‌ నంబరు వివరాలను వెంటనే పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయాలని పంపాలని ఆదేశించారు. 

Updated Date - 2020-08-05T11:37:34+05:30 IST