నిరసన మంట

ABN , First Publish Date - 2022-01-19T05:23:51+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ జారీ చేసిన జీవోను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి.

నిరసన మంట
కొవ్వూరు విజయ విహార్‌ సెంటర్‌లో పీఆర్సీ ప్రతుల దహనం

ప్రభుత్వం ప్రకటించిన ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల ఆగ్రహం

జీవో ప్రతుల దహనం.. నల్లబ్యాడ్జీలతో ఆందోళన


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ జారీ చేసిన జీవోను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. పనికిమాలిన పీఆర్సీ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టి జీవో కాపీ ప్రతులను దహనం చేశారు. హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌ తగ్గించే పీఆర్సీ జీవో వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. సీపీఎస్‌ రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు.


కొవ్వూరు, జనవరి 18: అప్రజాస్వామిక పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌ నుంచి విజయవిహార్‌ సెంటర్‌ వరకు మంగళవారం పనికిమాలిన పిఆర్‌సి మాకొద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. విజయవిహార్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించి, పీఆర్సీ పత్రాలను దహనం చేశారు. డి.జాన్‌, ఎస్‌కె. సలీ మ్‌, పి.రమేష్‌, మల్లిపూడి రాజు, ఎం.కళ్యాణ్‌కుమార్‌, జి.శ్రీనివాసమూర్తి, డి. జానకమ్మ, పి.పద్మావతి, సీహెచ్‌.రోజా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


కామవరపుకోట: ఫ్యాప్టో ఆధ్వర్యంలో కామవరపుకోటలో పీఆర్సీ కాపీలను దహనం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పలు సంఘాల నాయకులు హాజరయ్యారు.


గోపాలపురం: స్థానిక చెక్‌పోస్టు వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జీవో ప్రతులను తగలబెట్టి చలికాగారు. ఏ.జాన్‌బాబు, సనపల రాజశేఖర్‌, వెంకటేశ్వరరావు, రత్నకుమారి, కే.ఝాన్సీరాణి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


నల్లజర్ల: అశుతోష్‌ మిశ్రా సమర్పించిన పీఆర్సీ నివేదిక బయట పెట్టాలని, సీఎస్‌ కమిటీ నివేదిక ఆధారంగా విడుదల చేసిన పీఆర్సీ రద్దు చేయాలని ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.నరహరి, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం, వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T05:23:51+05:30 IST