Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒకరి తర్వాత మరొకరితో ఓ యువతి ప్రేమాయణం.. విషయం ఆ ఇద్దరు కుర్రాళ్లకు తెలిసింది.. చివరకు ఊహించని సీన్..!

టీనేజీ ప్రేమ ఎంతటి అనర్థాలకు దారితీస్తుందో చెప్పడానికి పవన్-ఆకాశ్-లతల ముక్కోణపు ప్రేమకథను ఉదాహరణగా చెప్పొచ్చు. రాజస్థాన్ వాసులైన ఈ ముగ్గురూ నిజమైన ప్రేమ అంటే అవగాహన లేక కేవలం తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.


రాజస్థాన్ అల్వర్ నగరంలో ఆకాశ్(20) నివసిస్తున్నాడు. అతను పాత సామాను వ్యాపారాం చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఆకాశ్‌కు లత అనే గర్ల్‌ఫ్రెండ్ ఉంది. వారిధ్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగేవారు. తమ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అనుకోకుండా ఒకరోజు పవన్(19) అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఒకరోజు వారిద్దరి ఫోటోలు చూశాడు. అతడు ఫొటోలు చూసి షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే.. ఆకాశ్‌తో తిరిగే లత అంతకుముందు పవన్‌తో డేటింగ్ చేసేది. దీంతో పవన్‌కు పట్టరాని కోపం వచ్చింది.


పవన్ యూనివర్శిటీలో బిఎస్‌సీ డిగ్రీ చదువుకునే విద్యార్థి. అతను తన గర్ల్‌ఫ్రెండ్ మరొకరితో తిరగడం సహించలేక పోయాడు. సోషల్ మీడియా వేదికగా ఆకాశ్‌ని బెదిరిస్తూ లతతో ఇక సంబంధం తెంచుకోవాలని హెచ్చరించాడు. పవన్ మెసేజ్‌లను చూసిన ఆకాశ్ రగిలి పోయాడు. "లతను వదిలేది లేదు.. నిజంగా మగాడివే అయితే ఎదురుగా వచ్చి మాట్లాడు. నీకు నీ తండ్రులకు భయపడే ప్రసక్తే లేదు" అంటూ ఆకాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బదులిచ్చాడు. 


ఆకాశ్ పెట్టిన మెసేజ్‌క పవన్ సమాధనమిస్తూ ఒక వీడియో పెట్టాడు. అందులో నిజమైన తుపాకీతో గాల్లో కాల్పులు చేస్తూ ఆకాశ్‌ను చంపేస్తానని అన్నాడు. ఈ మెసేజ్ పెట్టిన రెండు రోజుల తరువాత నేరుగా ఆకాశ్ ఇంటికి పవన్ వెళ్లాడు.  అక్కడ ఆకాశ్‌ని బయటికి రమ్మన్నాడు. ఆకాశ్ బయటికి రాగానే.. అందరూ చూస్తుండగా.. పవన్ తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆకాశ్ గుండెలపై కాల్చాడు. మరుక్షణం ఆకాశ్ నేలవాలాడు. ఆ తరువాత పవన్ అక్కడి నుంచి పారిపోయాడు. 


పోలీసులు ఆకాశ్ హత్య గురించి విచారణ మొదలు పెట్టారు. అతని సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజెస్ చూసి పవన్ గురించి తెలుసుకున్నారు. పవన్ కోసం అయిదు రోజు గాలించి పట్టుకున్నారు. పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. పవన్ హత్య చేశానని ఒప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement