తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలి

ABN , First Publish Date - 2020-05-09T10:13:19+05:30 IST

తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం

తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలి

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌


జగిత్యాల అగ్రికల్చర్‌, మే 8: తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థాన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వానకాలం సాగు ప్రణాళిక సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలకు అనుగుణంగా సన్న రకాలను ప్రోత్సహించాలని, రైతులే విత్తనోత్పత్తి చేసుకునే దిశగా అడుగు లు వేయాలని సూచించారు.


జిల్లా అధికారులు మం డలాల వారీగా 100 నుంచి 120 మంది రైతులతో సామాజిక దూరం పాటించేలా సమావేశాలు ఏర్పా టు చేసి, రైతులకు సరైన సూచనలు ఇవ్వాలని, నారు వేసేలోపే రైతులకు ఈ సమాచారం అందేలా చూడాలని అఽధికారులను ఆదేశించారు. దేశంలోనే రాష్ర్టాన్ని మోడల్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సీఎం కెసీఆర్‌ ముందుకు వెళ్తున్నారని, ప్రభు త్వం, సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ఆలోచలనల కు రైతులు సహకరించాలని కోరారు. 


ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన

గతానికి భిన్నంగా, రైతుల్లో చైతన్యం పెంపొందిం చి, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడంతో పాటు, సన్న రకాల పంటల ప్రోత్సాహానికి చ ర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రవి అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ ప్రతి రైతుకు ప్రభుత్వ ఆలోచనా విధానం చేరేలా అధికారులు ప్ర త్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌ రావు, రవి శంకర్‌లు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ సభలు ఏర్పా టు చేసి, రైతుల్లో అవగాహన కల్పించాలని, రైతుల చైతన్యం ద్వారానే కార్యక్రమం అనుకున్న స్థాయిలో విజయవంతం అవుతుందని, ఆ దిశగా అధికారులు రైతులకు సూచనలు చేయాలని అన్నారు. ఏడీఆర్‌ ఉమారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో వరిసాగు పెరిగే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 


డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు సరైన సలహాలు సూచనలు అం దడం లేదని, అధికారులు, రైతుల మధ్య దూరం పె రిగిందని ఆ దూరాన్ని తగ్గించి, రైతు సంక్షేమం కో సం అధికారులు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశం, ఏవో వెంకటేష్‌, ఆ ర్డీవో నరేంధర్‌, ఎంపీపీ గంగారాం, వైస్‌ ఎంపీపీ పొలాస రాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురే ష్‌ కుమార్‌, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్‌, జి ల్లా సహకార అధికారి రామానుజాచార్యులులతో పా టు వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, ఉత్త మ రైతులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు, స భ్యులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.     

Updated Date - 2020-05-09T10:13:19+05:30 IST