తెలంగాణ దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-06-03T11:08:59+05:30 IST

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, రైతు, పేద వర్గాల వారికి సంక్షేమ పఽఽథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇది తెలంగాణ ప్రజల

తెలంగాణ దేశానికే ఆదర్శం

ఆరు సంవత్సరాల్లో ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది

నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతుల కష్టాలు దూరం

కాళేశ్వరం ద్వారా జిల్లాకు గోదావరి జలాలు తరలించేందుకు చర్యలు

రాష్ట్ర అవతరణ వే డుకల్లో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్‌


కామారెడ్డి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, రైతు, పేద వర్గాల వారికి సంక్షేమ పఽఽథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఇది తెలంగాణ ప్రజల ఘనత అని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని మంగ ళవారం ఏడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచా రం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు అమర వీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ తెలంగాణ కోసం అమరులైన త్యాగదనుల కుటుంబాలకు, తెలంగాణ పోరాట యోధులకు, దేశ విదేశాల్లో ఉంటున్న వారికి, తెలంగాణ ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా, తెలం గాణ ప్రజల పోరాట పటిమ వల్ల సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈనాడు దేశంలోనే అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని అన్నారు. జూన్‌ 2, 2014లో ఏర్పడిన తెలంగాణ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడో సంవత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అభివృద్ధి ప్రణాళికను తయారుచేసి అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణను దేశంలోనే తలెత్తుకుని చూసేలా రైతులకు, పేద వర్గాలకు వివిధ సంక్షేమ  కార్యక్రమాల ను అమలు చేస్తూ ముందుకు వెలుతున్నారని అన్నారు. ఆసరా పెన్షన్స్‌, కేసీఆ ర్‌ కిట్స్‌, షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, సమన్వయ సమితిల ఏర్పాటు, 24 గంటల ఉచిత విద్యుత్‌ తదితర వినూత్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.


రూ.లక్షా 20వేల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం, డిండి, పాలమూరు, సీతారామసాగర్‌, భక్త రామదాసు, కొయిలసాగర్‌ తదితర పాజెక్టులతో కోటి ఎకారాలకు సాగు నీరు అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. గోదావరి నీటితో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం నీటితో శ్రీరామసాగర్‌ బ్యాక్‌ వాటర్‌తో ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలకు సంబంధించి దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణలో నీరు, నిధులు, నియామకాలే ముఖ్య ఉద్దేశ్యంతో అమలు చేయటం జరుగుతుందన్నారు.


రూ.40వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ సాధించుకున్నాక నీటి తర్వాత ఋణాల బకాయిలు మాఫీ చేసుకొని రైతంగానికి బాసటగా నిలవడం జరిగిందని, మన నిధులను సంక్షేమ కోసమే ఖర్చు చేసుకుంటున్నామన్నారు. కరోనా విపత్తులో కూడా తెలంగాణ ప్రజల క్షేమమే ముఖ్యంగా పేదవారికి 12 కిలోల బియ్యం పం పిణీ చేస్తున్నామని.. దాదాపు 87 లక్షల మందికి నెలకు రూ.1500 చొప్పు న అందించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల భాగస్వా మ్యంతో మత సామరాస్యంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. తెలం గాణ అవతరణ సందర్భంగా ఇంకా ఏమైన మర్చిపోయామని నెమరు వేసుకొని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ముందడుగు వేయడం జరుగుతు ందని అన్నారు.


ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ, కలెక్టర్‌ శరత్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌, ఎస్‌పీ శ్వేత, అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజాస్‌ నంద లాల్‌పవర్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పటేల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సంపత్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, ప్రజాప్రతిని ధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-06-03T11:08:59+05:30 IST