Abn logo
Oct 16 2021 @ 23:23PM

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం

మర్కుక్‌లో విశ్రాంతి భవనాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ

 రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్‌ అలీ 

 మర్కుక్‌లో పోలీస్‌ సిబ్బంది విశ్రాంత భవనం ప్రారంభం

జగదేవ్‌పూర్‌, అక్టోబరు 16 : శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ నిలిపారని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎండీ మహమూద్‌ అలీ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మర్కుక్‌లోని పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా రూ.3 కోట్లతో నిర్మించిన సిబ్బంది విశ్రాంతి భవనం, డైనింగ్‌హాల్‌ను శుక్రవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పోలీసులకు పెద్దపీట వేసి శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.  రాష్ట్ర పోలీసులకు అధునాతనమైన వాహనాలు సమకూర్చడం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్‌, భరోసా సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. డయల్‌ 100కు కాల్‌ చేయగానే పోలీసులు 5 నుంచి 10 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. దేశంలోనే ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ పోలీసులు కేంద్ర, రాష్ట్రస్థాయిలో ఎన్నో రివార్డులు పొందారని తెలిపారు.  పోలీస్‌ శాఖలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్‌ మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారని చెప్పారు. సిద్దిపేట జిల్లా పోలీసులు సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో ప్రజలకు అందిస్తున్న సేవలను అభినందించారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌గుప్తా, వెస్ట్‌ జోన్‌ ఐజీ శివశంకర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎస్పీ రెమా రాజేశ్వరీ, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడ్డి, గ్రామ సర్పంచ్‌ భాస్కర్‌, ఎంపీపీ పాండుగౌడ్‌, జడ్పీటీసీ మంగమ్మ, ఎంపీటీసీ చైతన్య, గడ అధికారి ముత్యంరెడ్డి, రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ విజయ్‌కుమార్‌, ఈఈ శ్రీనివా్‌సరావు, డీఈ రాజయ్య, ఏఈ సుధాకర్‌, కాంట్రాక్టర్‌ ప్రసాద్‌రావు, గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, గజ్వేల్‌ రూరల్‌ సీఐ కోటేశ్వరరావు, మర్కుక్‌ ఎస్‌ఐ శ్రీశైలం, ములుగు ఎస్‌ఐ రంగాకృష్ణ, గౌరారం ఎస్‌ఐ సంపత్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ క్రాంతికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.