ఆరేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ

ABN , First Publish Date - 2020-06-03T10:09:36+05:30 IST

తెలంగాణ రాష్ట్రం సాధించాక ఆరేళ్ల ప్రగతి అంటే అప్పులు చేయడమా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా

ఆరేళ్ల పాలనలో అప్పుల తెలంగాణ

అమరవీరుల స్థూపం తాకే హక్కు కేసీఆర్‌కు లేదు

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి


జగిత్యాల, ఆంధ్రజ్యోతి: తెలంగాణ రాష్ట్రం సాధించాక ఆరేళ్ల ప్రగతి అంటే అప్పులు చేయడమా అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్బావ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల బలిదానాలతో సాధించుకున్న మిగులు తెలంగాణ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని నడిపే నైతికత, అమరవీరుల స్థూపాన్ని తాకే హక్కులేదనీ అన్నారు. యువతకు ఉద్యోగాలు లేవని, ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్‌ లేదనీ , దీనికి తోడు కరోనా నెపంతో వేతనాల్లో కోతలు విధించడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, నాయకులు బండ శంకర్‌, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T10:09:36+05:30 IST