Advertisement
Advertisement
Abn logo
Advertisement

కేంద్రం కీలక ప్రకటన.. ఒకే పేరుతో తొమ్మిది కంటే ఎక్కువ Sim Cards ఉంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఇక్కడ SIM ఫ్రీ అనగానే ఎగబడి లెక్కలేనన్ని తీసుకున్నారా.. ఇంట్లో వారందరికీ ఒకే పేరుతో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్‌లు తీసుకెళ్లారా? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవల్సిందే.. టెలికాం వినియోగదారులకు కేంద్రం గురువారం కీలక ప్రకటన చేసింది. అదేంటంటే..


టెలికమ్యూనికేషన్ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. ఒకే పేరుతో తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్న వారి సిమ్ కార్డులను రీవెరిఫికేషన్ చేయాలని సూచించింది. అధికారులు వినియోగదారుడి పేరు మీద ఉన్న అన్ని సిమ్ కార్డ్స్‌ని పరిశీలిస్తారు. ఒకవేళ ఆ సిమ్‌ల్లో ఏ ఒక్కటి వెరిఫై చేయకపోయిన మిగిలిన నెంబర్లను కూడా డియాక్టివేట్ చేస్తారు. జమ్మూ కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లోని వినియోగదారులు ఆరు సిమ్‌ల కంటే ఎక్కువ కలిగి ఉంటే వాటిని పరిశీలించాలని తెలిపింది. 6 కంటే ఎక్కువ సిమ్ కార్డ్స్ ఉన్నట్లయితే కనెక్షన్ కట్ చేయాలని సూచించింది. అయితే కస్టమర్స్‌కు టెలికాం శాఖ ఒక అవకాశాన్ని కూడా కల్పించింది.


ప్రస్తుత ఆదేశాల ప్రకారం.. ఉన్న సిమ్ కార్డుల్లో తమకు నచ్చింది యాక్టివ్‌లో ఉంచుకుని మిగిలిన వాటిని స్విచ్ ఆఫ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. టెలికాం ఆపరేటర్‌లను 9 కంటే ఎక్కువ సిమ్ కార్డ్‌లు కలిగి ఉన్న వినియోగదారులకు నోటిఫికేషన్‌ పంపాలని ఆదేశించింది. అలాంటి SIM కార్డ్స్ అవుట్‌గోయింగ్ కాల్స్‌ను 30 రోజుల్లోగా, ఇన్‌కమింగ్ కాల్స్‌ను 45 రోజుల్లోగా నిలిపివేయాలని సూచించింది. అంతేకాకుండా వినియోగదారులు అదనపు సిమ్‌ను తమంట తాముగా డియాక్టివేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. అయితే క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాల విచారణలో నేరస్థులను పట్టుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని టెలికాం శాఖ అభిప్రాయపడింది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం సిమ్ కార్డ్  KYC నియమాలను సవరించిన విషయం తెలిసిందే. కొత్త సిమ్ తీసుకున్నాగానీ, నెంబర్‌ను మార్చుకున్నా గానీ ఎలాంటి పత్రాలను నింపాల్సిన పనిలేదని, డిజిటల్‌గా వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement