వామ్మో.. కిలో 49 వేల రూపాయలా అని ఆశ్చర్యపోకండి.. ఇంత ఖరీదైన ఈ చేపకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే..

ABN , First Publish Date - 2021-10-28T11:49:28+05:30 IST

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరాగనాస్ జిల్లాలో ఒక చేపలు పట్టే జాలరికి ఒక్కసారిగా అదృష్టం పట్టింది. అతని వలలో ఒక భారీ ఆకారంలో ఉన్న అతివిలువైన చేప దొరికింది. దాని పొడువు ఏడడుగులు, బరువు 75 కిలోల పైగానే ఉంటుంది. ఆ చేప రేటు అక్షరాల రూ.49,300 కిలో అని చెబుతున్నారు...

వామ్మో.. కిలో 49 వేల రూపాయలా అని ఆశ్చర్యపోకండి.. ఇంత ఖరీదైన ఈ చేపకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే..

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరాగనాస్ జిల్లాలో ఒక చేపలు పట్టే జాలరికి ఒక్కసారిగా అదృష్టం పట్టింది. అతని వలలో ఒక భారీ ఆకారంలో ఉన్న అతివిలువైన చేప దొరికింది. దాని పొడువు ఏడడుగులు, బరువు 75 కిలోల పైగానే ఉంటుంది. ఆ చేప రేటు అక్షరాల రూ.49,300 కిలో అని చెబుతున్నారు. అంటే ఆ చేప వల్ల ఆ జాలరి దాదాపు 36 లక్షలు సంపాదించాడ్నమాట. ఆ చేప అతనికి ఎలా దొరికిందంటే..


24 పరాగనాస్ జిల్లాలో సుందర్ బన్ ప్రాంతానికి చెందిన బికాశ్ బర్మన్‌ అనే జాలరి చాలాకాలం చేపలు పట్టే పనిచేస్తున్నాడు. ఆ ప్రాంతంలో చాలామందికి 'తేలియా భోలా' చేప దొరికడంతో వారంతా ఒక్కసారిగా ధనికులుగా మారిపోయారు. బికాశ్ బర్బన్ కూడా తన వలలో ఎప్పుడో ఒకసారి తేలియా చేప పడకపోతుందా అని ఎదురు చూసేవాడు. ఇటీవల ఒకరోజు అతడు చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు తన వలలో ఏదో పెద్ద వస్తువు పడింది. చాలా బరువుగా ఉండడంతో తన స్నేహితులను గట్టిగా అరచి పిలిచాడు. బికాశ్‌తో పాటు మరో ముగ్గురు జాలర్లు కూడా అతనితో ఉన్నారు. వారంతా కలిసి ఆ వలను లాగారు. 


వలలో పడిన వస్తువు భారీ ఆకారంలో ఉందని వారికి అర్థమైంది. ఎందుకంటే ఆ నలుగురు కూడా వలలో ఉన్న వస్తువును లాగడానికి చాలా కష్టపడ్డారు. కాస్త పైకి లాగగానే ధగధగ మెరిస్తూ ఏదో కనపడింది. బికాశ్‌తో పాటు ఉన్న తన స్నేహితులలతో ఒకడు గట్టిగా అరిచాడు. "అది తేలియా చేప.. అందరూ చూడండి" అని అన్నాడు. బికాశ్‌కు తన అదృష్టంపై నమ్మకం కలుగలేదు. ఒక మనిషి ఆకారమంతా భారీగా ఉంది. దానిని పొడవుని కొలిచి చూస్తే దాదాపు 7 అడుగులు ఉంది. బరువు 75 కిలీల కంటే ఎక్కువ ఉంది. ఆ చేపను మార్కెట్ తీసుకెళ్లడానికి అందరూ చాలా కష్టపడ్డారు. చేపల హోల్‌సేల్ మార్కెట్‌కి తీసుకెళ్లగా.. అది వేలం పాటలో ఒక కిలో ధర రూ.49,300 పలికింది. ఆ ధర విని బికాశ్ ఆనదానికి హద్దులేకుండా పోయింది. ఒక్కసారిగా బికాశ్ వలలో రూ. 36 లక్షలు వచ్చిపడ్డాయి.


ఆ చేపకు ఎందకు అంత ధర? అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. తేలియా భోలా చేప కడుపు భాగాలు చాలా విలువైనవి. ఔషధాలు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలు వాటిని ఎక్కువ ధర ఇచ్చి మరీ తీసుకుంటాయి. తేలియా చేపలోని కొన్ని భాగాలలో నుంచి తీసిన తైలం అత్యంత విలువైనది. దానితో తయారు చేసే ఔషధాలు ప్రాణాలు కాపాడగలవు అని చెబుతారు. అందుకోసం దాని విలువ లక్షల్లో పలుకుతుంది. 


గత సంవత్సరం కూడా ఒక మహిళా జాలరికి ఒక మహిళా జాలరికి 52 కిలోల తేలియా చేప చిక్కింది. కానీ ఆమె మార్కెట్ తీసుకురావడానికి ఆలస్యం చేయడం వలన దాని విలువ తగ్గిపోయింది. అయినా దాని విలువ మూడు లక్షలు పలికింది. మార్కెట్‌కు తీసుకురావడంలో ఆలస్యం చేయడం వల్ల ఆ చేప కాస్త కుళ్లిపోయిందని.. అయినా దానికి ధర రూ.6,200 పలికిందని సమాచారం.


Updated Date - 2021-10-28T11:49:28+05:30 IST