ఖతర్‌లో తెలుగు కార్మికుడికి కరోనా.. రెండు నెలలు చికిత్స చేసినా..

ABN , First Publish Date - 2020-07-16T18:36:04+05:30 IST

బతుకుదెరువు నిమిత్తం దోహా ఖతర్‌ వెళ్లిన కమ్మర్‌పల్లి మండలం బషీరాబా ద్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో చికిత్స పొందు తూ బుధవారం మృతి చెందాడు. గ్రామస్థుల కథ నం ప్రకారం గ్రామానికి చెందిన

ఖతర్‌లో తెలుగు కార్మికుడికి కరోనా.. రెండు నెలలు చికిత్స చేసినా..

దోహా ఖతర్‌లో కరోనాతో బషీరాబాద్‌ వాసి మృతి


కమ్మర్‌పల్లి (నిజామాబాద్): బతుకుదెరువు నిమిత్తం దోహా ఖతర్‌ వెళ్లిన కమ్మర్‌పల్లి మండలం బషీరాబా ద్‌ గ్రామానికి చెందిన వ్యక్తి కరోనాతో చికిత్స పొందు తూ బుధవారం మృతి చెందాడు. గ్రామస్థుల కథ నం ప్రకారం గ్రామానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఆరు నెలల క్రితం విజిట్‌ వీసాపై దోహా ఖతర్‌ వెళ్లి ఓ కంపెనీలో ఫోర్‌మెన్‌గా పనిలో చేరాడు. మే18వ తేదీ న తీవ్రమైన జ్వరంతో ఆసుపత్రిలో చేరగా పరీక్షల చేసిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్ధారించారు.


సుమారు రెండు నెలల పాటు చికిత్స పొందిన వ్యక్తి వ్యాధి నయం కాకపోవడంతో బుధవారం మధ్యా హ్నం మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రివర్గాలు ధ్రువీకరించడంతో అక్కడే ఉన్న బషీరాబాద్‌ గ్రామానికి చెందిన వ్యక్తులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో చివరి చూపునకు కూడా నోచుకోకుండా పోయామని భార్య, కూతురు, తల్లి, బంధువుల రోదనలు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. 

Updated Date - 2020-07-16T18:36:04+05:30 IST