తెలుగు యువత వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-08-12T16:53:33+05:30 IST

గుంటూరు: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తెలుగు యువత నాయకులు వినూత్నంగా నిరసన తెలియజేశారు.

తెలుగు యువత వినూత్న నిరసన

వైసీపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్

రోడ్డుపై పండ్లు, చేపలు అమ్ముతూ వినూత్న నిరసన


గుంటూరు: అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై తెలుగు యువత నాయకులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. పండ్లు, చేపలు అమ్ముతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రాయపాటి సాయి మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. వెంటనే దాన్ని రద్దు చేసి కొత్త క్యాలెండర్‌ను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పాదయాత్ర హామీలను సీఎం జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయడం లేదని విమర్శించారు. మెగా డీఎస్సీ పెడతామని హామీ ఇచ్చారని.. రెండేళ్ళైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదని.. అందుకే రోడ్డుపై చేపలు అమ్ముతూ నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

టీడీపీ ఇన్‌చార్జ్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ వలంటీర్ల పేరు చెప్పి లక్ష ఉద్యోగాలు  ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు. బోగస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమైన కంపెనీలన్నీ రాష్ట్రం వదిలి వెళ్ళేలా చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజుల్లో 2,30,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-12T16:53:33+05:30 IST