ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-06-19T04:31:51+05:30 IST

కరోనా కట్టడి, ప్రజలను ఆదుకో వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు.

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ నేతలు

కొవ్వూరు, జూన్‌ 18: కరోనా కట్టడి, ప్రజలను ఆదుకో వడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శించారు. కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించి ఆర్డీవో డి.లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. చంద్రన్న భీమా కొనసాగి ఉంటే కరోనాతో మృతి చెంది న కుటుంబానికి 10 లక్షల బీమా వచ్చేదని, బీమా తీసివేయడం వలన మృ తుల కుటుంబాల ఇబ్బందులకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. జీవనోపాధి కొల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. పది వేలు, మృతుల కుటుంబా లకు రూ.10లక్షలు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా కేంద్రం, 12 రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ. 50 లక్షలు పరిహారం అందించాలన్నారు. కరోనా నియంత్రణలో విపలమైన ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అన్న క్యాంటిన్లను ప్రారంభించి కొవిడ్‌ బాధితులతో పాటు, పేదల ఆకలి తీర్చాలన్నారు. బూరుగుపల్లి వీరరాఘవులు, రాపాక తిలక్‌, పొట్రు శ్రీనివాసరావు, వేగి సత్యనారాయణ, రొడి చంటయ్య, మైనం గంగరాజు, గారపాటి వెంకటకృష్ణ, సర్పంచ్‌ పాలడుగుల లక్ష్మణరావు, వట్టికూటి వెంకటేశ్వరరావు, ముత్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్‌కు మార్‌, టీడీపీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, కౌన్సిలర్‌ నంబూరి రామచంద్రరాజు, రమాదేవి, చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, చెరుకూరి శ్రీధర్‌, కాసాని ప్రసాద్‌, కలారు సత్యనారాయణ, పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-19T04:31:51+05:30 IST