2025 నాటికి మందిరం!

ABN , First Publish Date - 2021-08-05T06:09:12+05:30 IST

అయోధ్యలో ఓవైపు భవ్యమైన రామమందిర నిర్మాణం సాగుతుండగానే లోపల రామ్‌లల్లాను

2025 నాటికి మందిరం!

అయోధ్య, ఆగస్టు 4: అయోధ్యలో ఓవైపు భవ్యమైన రామమందిర నిర్మాణం సాగుతుండగానే లోపల రామ్‌లల్లాను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు. 2023 డిసెంబరు నాటికి మందిరం తాలూకు గ్రౌండ్‌ఫ్లోర్‌ నిర్మాణం పూర్తికానుందని, అప్పటి నుంచే భక్తులను మందిరం లోపలికి అనుమతిస్తామని రామ మందిరం ట్రస్ట్‌ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ప్రధాని మోదీ భూమి పూజ చేసి గురువారంతో సరిగ్గా ఏడాది పూర్తికానుంది. నిరుడు ఆగస్టు 5న భూమి పూజ జరిగినప్పటి నుంచే మందిర నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2025 నాటికి మందిర నిర్మాణం పూర్తికానుంది.


Updated Date - 2021-08-05T06:09:12+05:30 IST