దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాలి

ABN , First Publish Date - 2021-01-21T05:13:23+05:30 IST

మండలంలోని అన్ని గ్రామాల్లోని దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గాలివీడు ఎస్‌ఐ ఇనయతుల్లా తెలిపారు.

దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాలి

గాలివీడు, జనవరి20: మండలంలోని అన్ని గ్రామాల్లోని దేవాలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గాలివీడు ఎస్‌ఐ ఇనయతుల్లా తెలిపారు. బుధవారం స్థానిక ఎస్‌కే ఫంక్షన్‌ హాల్లో జరిగిన గ్రామ వలంటీర్లు, పోలీసులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ రక్షణ దళం ఏర్పాటు కోసం ప్రతి గ్రామంలో ఐదు నుంచి 10 మంది వరకు యువకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, సేవాగుణం కలిగిన వారిని ఎంపిక చేసుకున్నామన్నారు.  ప్రతి ఆలయాన్ని నిత్యం సందర్శిస్తూ ఆలయాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.కార్యక్రమంలో వలంటీర్లు, ఏఎ్‌సఐ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T05:13:23+05:30 IST