Advertisement
Advertisement
Abn logo
Advertisement

ట్రాక్టర్‌ని ఢీకొన్న టెంపో

ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

శాంతిపురం, నవంబరు 30:  కుప్పం-పలమనేరు ప్రధాన రహదారిలో నాయనపల్లె వద్ద ట్రాక్టర్‌ని ఢీకొన్న టెంపో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శాంతిపురానికి చెందిన మధు(38) స్థానికంగా పెయింట్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు పెయింట్ల డబ్బాలను తెచ్చేందుకు ట్రాక్టర్‌పై వి.కోటకు బయలుదేరాడు. వెంట బంధువు నిఖిల్‌(26)ని తీసుకెళ్లాడు. వీరు వెళుతున్న ట్రాక్టర్‌ నాయనపల్లె వద్దకు చేరుకోగానే ఎదురుగా వి.కోట నుంచి తమిళనాడుకు బంగాళదుంపల లోడుతో వెళుతున్న టెంపో ఢీకొంది.  ఈ ప్రమాదంలో మధు అక్కక్కడే మృతి చెందగా, నిఖిల్‌ తీవ్రగాయాలతో పడి ఉండగా స్థానికులు అతడిని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నాయనపల్లె ప్రాంతం కర్ణాటక రాష్ట్ర పరిధిలోది కావడంతో కేజీఎఫ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement