కరోనా ఖైదీల కోసం తాత్కాలిక జైళ్ల నిర్మాణం..!

ABN , First Publish Date - 2021-04-18T22:09:19+05:30 IST

కరోనా బారినపడ్డ ఖైదీలను క్వారంటైన్‌లో పెట్టేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలిక జైళ్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది.

కరోనా ఖైదీల కోసం తాత్కాలిక జైళ్ల నిర్మాణం..!

లక్నో: కరోనా బారినపడ్డ ఖైదీలను క్వారంటైన్‌లో పెట్టేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలిక జైళ్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జిల్లా యంత్రాంగంతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం వివిధ జైళ్ల సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ తాజాగా ఓ ప్రకటన చేశారు. అంతేకాకుండా.. కరోనా బారిన పడ్డ వారి రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు యోగా క్లాసులు చేపట్టాలని కూడా తమకు సూచనలు అందినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 48 తాత్కాలిక జైళ్లు ఉండగా..వాటిల్లో 3500 మంది ఖైదీలు ఉన్నారు. కాగా.. ఖైదీల కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని న్యాయస్థానాలను జైళ్ల శాఖ కోరింది. 

Updated Date - 2021-04-18T22:09:19+05:30 IST