Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 2 2021 @ 10:54AM

గుజరాత్‌లో boat బోల్తాపడి 10 మంది మత్స్యకారుల గల్లంతు

అహ్మదాబాద్: గుజరాత్‌ రాష్ట్రంలోని గిర్ సోమనాథ్ సమీపంలోని సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. గిర్ సోమనాథ్ జిల్లా సమీపంలో భారీవర్షాలు, గాలుల వల్ల పడవ బోల్తా పడింది. భారీ వర్షాలు,ఉద్ధృతంగా వీచే గాలుల వల్ల పడవలు బోల్తా పడ్డాయని అధికారులు చెప్పారు. పోలీసులు, సహాయ సిబ్బంది, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలిస్తున్నారు.భారీవర్షాలు కురుస్తున్నా మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదం బారిన పడ్డారని అధికారులు చెప్పారు.

Advertisement
Advertisement