టెన్షన్‌.. టెన్షన్‌

ABN , First Publish Date - 2020-04-04T10:48:00+05:30 IST

జిల్లాలో టెన్షన్‌ మొదలైంది. ఢిల్లీలోని మర్కజ్‌ ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. మర్కజ్‌కు వెళ్లి

టెన్షన్‌.. టెన్షన్‌

జిల్లాలో మర్కజ్‌పై జోరందుకున్న చర్చ

ఢిల్లీ వెళ్లి వచ్చినవారి కోసం జల్లెడ పడుతున్న అధికారులు

32 మందిగా గుర్తించిన అధికారులు

పొలాస క్వారంటైన్‌లోనే హర్యానాకు వెళ్లి వచ్చినవారు

66 మంది శాంపిల్స్‌ను హైదరాబాద్‌కు పంపిన అధికారులు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో టెన్షన్‌ మొదలైంది.  ఢిల్లీలోని మర్కజ్‌ ఘటన ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్లుగా ఒక్కొక్కటి బయట పడుతున్నాయి.  జిల్లా నుంచి మర్కజ్‌కు వెళ్లినవారు మొదట్లో 18 మందిగా భావించినప్పటికీ రోజుకో చోట వెళ్లి వచ్చినవారి వివరాలు బయట పడుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 32 మంది  వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. క్వారంటైన్‌కు గడువు పూర్తి కాగా, ఎవరికి కూడా కరోనా లక్షణాలు లేవు. అయితే కొన్ని చోట్ల లక్షణాలు లేనప్పటికీ వ్యాధి బారిన పడి మరణించి నట్లుగా వైద్యాధికారులు నిర్ధారించడంతో గుబులు మొద లైంది. జగిత్యాల, పెగడపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన 32 మంది ఢిల్లీలోకి మర్కజ్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. వీరంతా హోం క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల తో గడిపారు. దీని దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ రవి వారందరినీ రెండు రోజుల క్రితమే కొండగట్టు సమీపంలోని జేఎన్‌టీ యూలో ఏర్పాటు చేసిన హోం క్వారంటైన్‌కు తరలించారు. 


ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా గురు వారం రాత్రి వారి శాంపిల్స్‌ తీసి పరీక్ష కోసం హైదరా బాద్‌కు పంపారు. శనివారం ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు కోరుట్లకు చెందిన 32 మంది హర్యానాలో జరిగిన 40 రోజుల మత ప్రార్థనల కార్యక్ర మంలో పాల్గొన్నారు. వారు నాలుగు రోజుల క్రితం ఇంటికి బయలుదేరగా, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగా వద్ద పట్టుకుని నేరుగా వారిని పొలాసలో ఏర్పాటు చేసిన హోం క్వారంటైన్‌కు తరలించారు. వారితో పాటు డీసీఎం వాహనానికి చెందిన డ్రైవర్‌, క్లీనర్‌లను హోం క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్‌ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం ఎవరికీ లేనప్పటికీ 34 మంది నమూనాలను సేకరించి గురువారం రాత్రి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష కోసం హైదరాబాద్‌కు పం పారు. వీరి ఫలితాలు కూడా శనివారం రానున్నాయి. ఇది లా ఉంటే ఈ నెల 10న జగిత్యాల, మేడిపల్లి, కథలాపూర్‌కు చెందిన ముగ్గురు విదేశాలకు వెళ్లినవారు స్వగ్రామాలకు రాగా, వారిని కూడా ముందు జాగ్రత్తగా జేఎన్‌టీయూలోని క్వారంటైన్‌కు తరలించారు.


 ఇప్పటివరకు 92 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించి, అందులో 26 మందికి పరీక్షలు చేయగా, అందరికీ నెగెటివ్‌ రిపోర్ట్స్‌ వచ్చాయి. జిల్లాలో ఎలాంటి భయాందోళ నలు లేనప్పటికీ ఢిల్లీలోని మర్కజ్‌తో పాటు హర్యానా వెళ్లి వచ్చినవారు ఉండటంతో జిల్లా ప్రజల్లో గుబులు మొ దలైంది. మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారి కుటుంబసభ్యులను గుర్తించి దాదాపు 250 మందిని ప్రస్తుతానికి హోం క్వారం టైన్‌లో ఉండాలని ఆదేశించారు.  

Updated Date - 2020-04-04T10:48:00+05:30 IST