టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-06-03T09:38:27+05:30 IST

జీవో 203ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జలదీక్ష నిర్వహించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు మంగళవారం వెళ్తున్న కాంగ్రెస్‌

టెన్షన్‌ టెన్షన్‌

దేవరకొండ, చింతపల్లి, జూన్‌ 2: జీవో 203ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జలదీక్ష నిర్వహించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు మంగళవారం వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశా రు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని చింతపల్లి మండలం మాల్‌ వద్ద అరె్‌స్ట చేసి గొడుకొండ్ల కృష్ణవాటర్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌ అతిథిగృహనికి తరలించా రు.  దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవరకొండ కాంగ్రెస్‌ కార్యాలయంలో జెండా ఎగురవేసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ను ఇంటి వద్దనే అడ్డుకొని నల్లగొండకు తరలించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి మూడు వాహనాల్లో హైదరాబాద్‌ నుంచి ఎస్‌ఎల్‌బీసీకి వెళ్తుండగా, వీటీనగర్‌లో దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, సుమారు వందమంది పోలీస్‌ సిబ్బంది వారిని గొడుకొండ్ల రిజర్వాయర్‌ వద్ద నిలిపివేశారు.


ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గానికి వెళ్లేందుకు అనుమతిలేదని నేతలకు వారు తేల్చిచెప్పా రు. తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు నాయకులు సుమారు గంటపాటు రిజర్వాయర్‌ ఎదుట బైఠాయించారు. ఈ లోగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకోగా ఆయన్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని గొడుకొండ్ల రిజర్వాయర్‌ అతిథిగృహంలోకి తీసుకెళ్లి గేట్లు వేశారు. విషయాన్ని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ ద్వారా గవర్నర్‌ తమిళిసైకి ఫిర్యాదు చేశారు. ఈలోగా వారిని చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు భారీ సంఖ్యలో స్టేషన్‌కు వద్దకు చేరుకొని ఎదుట ఆందోళన చేశారు. సుమారు 40 నిమిషాల అనంతరం ముగ్గురు నేతలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవరకు విశ్రమించేదిలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, డివిజన్‌లోని కాంగ్రెస్‌ నేతలు జలదీక్షకు వెళ్లకుండా ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్ట్‌ చేశారు.



Updated Date - 2020-06-03T09:38:27+05:30 IST