టెన్షన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2022-09-19T05:41:22+05:30 IST

జిల్లాలో మరోసారి ఉగ్రవాద మూలాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారు జామున ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారులు ఓ కాలనీలోని రెండు ఇళ్లను సోదా చేసిన ఉదాంతం దుమారం రేపుతోంది. ఇదే రోజున నిజామాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఎన్‌ఐఏ అధికారులు పలువురు ఇళ్లపై సోదాలు చేయడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని కీలక సమాచారాన్ని సేకరించారు. అయితే భైంసాలో అనూహ్యంగా ఎన్‌ఐఏ అధికారుల దాడుల వ్యవహారం మరోసారి టెన్షన్‌ రేపింది. మొ దటి నుంచి ఎన్‌ఐఎ అధికారులు భైంసాపై ఓ నజర్‌ సారించినట్లు జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా ఈ దాడులు చర్చకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం డియా బాధ్యుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఆయన ద్వారా రాబట్టిన సమాచారం మేరకే భైంసాలో దాడులు జరిగాయంటున్నారు. ఐఎస్‌ఐ కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న పీఎఫ్‌ఐకి అంతటా సానుభూతి పరులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొద్ది రోజుల నుంచి భైంసా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఏకకాలంలో మరికొన్ని జిల్లాల్లో దా డులు జ

టెన్షన్‌.. టెన్షన్‌!
సోదాలు చేసేందుకు వస్తున్న ఎన్‌ఐఏ అధికారులు

భైంసాలో ఎన్‌ఐఏ సోదాలతో అలజడి 

ఓ కాలనీలోని పలు ఇళ్లల్లో సోదాలు 

మూలల గుట్టురట్టు కోసం మొదలైన ఆపరేషన్‌

నిర్మల్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మరోసారి ఉగ్రవాద మూలాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఆదివారం తెల్లవారు జామున ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారులు ఓ కాలనీలోని రెండు ఇళ్లను సోదా చేసిన ఉదాంతం దుమారం రేపుతోంది. ఇదే రోజున నిజామాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల కూడా ఎన్‌ఐఏ అధికారులు పలువురు ఇళ్లపై సోదాలు చేయడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ఆదుపులోకి తీసుకొని కీలక సమాచారాన్ని సేకరించారు. అయితే భైంసాలో అనూహ్యంగా ఎన్‌ఐఏ అధికారుల దాడుల వ్యవహారం మరోసారి టెన్షన్‌ రేపింది. మొ దటి నుంచి ఎన్‌ఐఎ అధికారులు భైంసాపై ఓ నజర్‌ సారించినట్లు జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా ఈ దాడులు చర్చకు తావిస్తోంది. కొద్దిరోజుల క్రితం నిజామాబాద్‌లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం డియా బాధ్యుడిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు ఆయన ద్వారా రాబట్టిన సమాచారం మేరకే భైంసాలో దాడులు జరిగాయంటున్నారు. ఐఎస్‌ఐ కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న పీఎఫ్‌ఐకి అంతటా సానుభూతి పరులున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని కొద్ది రోజుల నుంచి భైంసా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఏకకాలంలో మరికొన్ని జిల్లాల్లో దా డులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భైంసాలో మా త్రం అనుమానిత వ్యక్తులు వారికి పట్టుబడలేదంటున్నారు. ఇక్కడ ఎవరిని అదుపులోకి తీసుకోకపోయినప్పటికీ కీలక సమాచారం సేకరించినట్లు పేర్కొంటున్నారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా కార్యకలాపాలు జిల్లాలో ఏ మేరకు జరిగాయనే అంశంతో పాటు సానుభూతిపరుల వివరాలను సైతం సేకరించారంటున్నారు. కొన్ని కీలకమైన వస్తువులు, డాక్యుమెంట్‌లను స్వా ధీనం చేసుకున్నారని సమాచారం. 

భైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌ పట్టణాలపై కొంతకాలం నుంచి కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలతో పాటు ఎన్‌ఐఏ వర్గాలు రహస్యంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం హర్యానా నుంచి నిర్మల్‌ మీ దుగా అక్రమ ఆయుధాలు రవాణా జరిగిన వ్యవహారం వెలుగు చూసి నప్పటి నుంచే ఎన్‌ఐఏ వర్గాలు నిర్మల్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయంటున్నారు. ముఖ్యంగా మహరాష్ట్ర సరిహద్దున ఉన్న భైంసాపైనే రహస్య విభాగాలన్ని ఫోకస్‌ పెట్టాయని చెబుతున్నారు. గతంలో భైం సా కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలున్న సం గతి తెలిసిందే. భైంసాలో కొంతకాలం పాటు ఉగ్రవాద శిక్షణను నిర్వహించిన ఆజాంగోరి అనే ఉగ్రవాది జగిత్యాల్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ ఉదాంతం జిల్లా అంతటా కలకలం సృష్టించింది. 

గత కార్యకలాపాలపై నజర్‌ 

భైంసాలో గతంలో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై కూడా ఎన్‌ఐఏ విశ్లేషణ జరుపుతున్నట్లు సమాచారం. అప్పట్లో ఆజాంగోరి భైంసాను అడ్డగా చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించినట్లు ఆరోపణలున్నా యి. స్థానిక యువకులను కాకుండా ఇతర ప్రాంతాల యువకులకు షెల్టర్‌ ఇస్తూ శిక్షణ లు కొనసాగించారంటున్నారు. శిక్షణల తరువాత వారందరికీ ప్రాంతాలు కేటాయించేవారని, ఆ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉండేదంటున్నారు. భైంసా, నిర్మల్‌, ఖానాపూర్‌ ప్రాం  తాలు ఉగ్రవాదులకు షెల్టర్‌లుగా మారిపోయాయన్న కోణంలో ఎన్‌ఐఏ అధికారులు ఇ టు వైపు గురి పెట్టారంటున్నారు. అప్పట్లో భైంసాను కేంద్రంగా చేసుకొని ఉగ్రవాద కార్య కలాపాలు జరిపిన ఆజాంగోరి అనే టెర్రరిస్టును పోలీసులు జగిత్యాల్‌లో ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆయన నుంచి సేకరించిన సమాచారానికి అనుగుణంగా భైంసా ప్రాంతంలో మొదటి నుంచి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆనాటి సంఘటనలను విశ్లేషిస్తూ సానుభూతి పరులు అలాగే సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసే వారికి ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

మొదటి నుంచి అనుమానమే..

ఎన్‌ఐఏ అఽధికారులు మొదటి నుంచి భైంసాపై అనుమానాలు వ్య క్తం చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. హర్యానా నుంచి ఆయుధాల రవా ణా వ్యవహారంతో పాటు గతంలో జరిగిన టెర్రరిస్టు కార్యకలాపాల దృష్ట్యా ఇటు కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు అటు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ లాంటి అత్యున్నత సంస్థల అధికారులు రంగంలోకి దిగారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్రంలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో కొంతకాలం నుంచి ఈ సంస్థ సానుభూ తిపరుల రిక్రూట్‌మెంట్‌ జరుపుతున్నట్లు సమాచారం. అయితే స్థానిక యువకులు ఎవరూ కూడా వీరికి ప్రాధాన్యతనివ్వకపోయినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ షెల్టర్‌ తీసుకొని ఉండవచ్చన్న కోణంతో ఎన్‌ ఐఎ దర్యాప్తు చేపట్టిదంటున్నారు.

షెల్టర్‌గా మారుతుందంటున్న అధికారులు..

నాందేడ్‌, పర్బనీతో పాటు తదితర ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న ప్రచారం ఉంది. అక్కడి పోలీసుల దృష్టి ని మరల్చేందుకు ఉగ్రవాదులు జిల్లాను షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నారంటున్నారు. వీరు ఇతర కార్యకలాపాల కోసం జిల్లాలో ఉంటున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయంటున్నారు. జిల్లా ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఏదైనా చిన్న సంఘటన జరిగిన పోలీసులు సీరియస్‌గా అప్రమత్తమవుతుండడంతో ఏళ్ల నుంచి ఇరువర్గాల మధ్య బ హిరంగ సంఘటనలు చోటు చేసుకోలేదు. మరోసారి భైంసాలో జరిగిన ఎన్‌ఐఏ దాడుల వ్యవహారం సర్వత్రా కలకలం సృష్టిస్తోంది.

Updated Date - 2022-09-19T05:41:22+05:30 IST