పార్లమెంట్‌లో నీలి చిత్రాలు చూస్తూ..

ABN , First Publish Date - 2020-09-19T00:13:36+05:30 IST

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతూ ఉంటే రోన్నతెప్ అనువాత్ అనే ఎంపీ నీలి చిత్రాలు చూస్తూ కనిపించారు. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు.

పార్లమెంట్‌లో నీలి చిత్రాలు చూస్తూ..

బ్యాంకాక్: ఆ మధ్య కర్నాటక అసెంబ్లీలో ఓ ప్రజాప్రతినిధి నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు చిక్కిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలాంటి ఘటనే మన పొరుగు దేశం థాయ్‌లాండ్ పార్లమెంట్‌లో చోటు చేసుకుంది. థాయ్‌లాంట్ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతూ ఉంటే రోన్నతెప్ అనువాత్ అనే ఎంపీ నీలి చిత్రాలు చూస్తూ కనిపించారు. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఈ దృశ్యాన్ని చూసి ఖంగుతిన్నారు.


బడ్జెట్ సమావేశాల సందర్భంగా దేశ రాజధాని బ్యాంకాక్‌లో ఉన్న పార్లమెంట్‌కు హాజరైన అధికార పార్టీకి చెందిన ఎంపీ రోన్నతెప్ అనువాత్ పది నిమిషాల పాటు నీలి చిత్రాలను స్క్రోల్ చేసినట్లు ఓ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. నీలి చిత్రాలు చూస్తున్న ఎంపీని ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకర్లు ఈ ఫొటోలను తీశారు. అయితే పార్లమెంట్‌లో తాను నీలి చిత్రాలను చూసినట్లు విలేకర్లతో ఒప్పుకున్నట్లు సమాచారం.


అయితే ఆ చిత్రాలను చూడడానికి గల ఓ విచిత్ర కారణాన్ని రోన్నతెప్ అనువాత్ వెల్లడించారు. తానకు ఆ చిత్రాలు ‘లైన్‌’ అనే యాప్‌ ద్వారా వచ్చాయని అన్న ఆయన, ఆ చిత్రాల్లోని మహిళ సహాయం కోసం అర్జిస్తోందని, డబ్బుల కోసం ప్రాదేయపడుతోందని చెప్పుకొచ్చాడు. అది నిజమా, అబద్ధమా అని తెలుసుకునేందుకే తాను వాటిని చూశానని ఆయన అన్నారు.


‘‘మీరు ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించండి. కొంత మంది గ్యాంగ్‌స్టర్లు ఆమెను వేధింపులకు గురి చేస్తూ ఆమె చిత్రాలు తీసినట్లు కనిపిస్తోంది’’ అని అన్నారు. అనంతరం.. ఆయన ఫోన్ నుంచి ఆ ఫొటోలను డిలీట్ చేశారు.

Updated Date - 2020-09-19T00:13:36+05:30 IST