Nashik: 30మందికి డెల్టా వేరియంట్ వైరస్

ABN , First Publish Date - 2021-08-07T15:43:05+05:30 IST

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కలకలం రేపుతోంది....

Nashik: 30మందికి డెల్టా వేరియంట్ వైరస్

 నాసిక్ (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కలకలం రేపుతోంది. నాసిక్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 30 డెల్టా వేరియంట్ వైరస్ కేసులు వెలుగుచూశాయి. నాసిక్ జిల్లాలో వెలుగుచూసిన 30 డెల్టా వేరియంట్ కేసుల్లో 28 మంది గ్రామీణ ప్రాంతాల రోగులే ఉన్నారు. నాసిక్ లోని గంగాపూర్, సాదిఖ్ నగర్ లలో రెండు డెల్టా వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. సిన్నార్, యేలో, నందగాం, నిఫాడ్ ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ కేసులు నమోదైనాయని నాసిక్ జిల్లా కేంద్ర ఆసుపత్రి సర్జన్ డాక్టర్ కిషోర్ శ్రీనివాస్ చెప్పారు. పూణేలో జరిపిన పరీక్షల్లో నాసిక్ కరోనా రోగులకు సోకింది డెల్టా వేరియంట్ అని తేలింది. ప్రజలు కరోనా సోకకుండా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.


Updated Date - 2021-08-07T15:43:05+05:30 IST